తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు. మద్దికేరలోని స్థానిక ప్రధాని కూడలిలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని ఆయన పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో అదృష్టకరమన్నారు టీడీపీ నేతలు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు రాజన్న యాదవ్, జిల్లా కార్యదర్శి గూడూరు ధనుంజయ యాదవ్, మండల కన్వీనర్ ఎస్ వి శివప్రసాద్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి పెదవలి రామాంజనేయులు, మండల మాజీ కన్వీనర్ ఆవుల పెద్దన్న, న్యాసరిలక్ష్మీనారాయణ, తెలుగు యూత్ అధ్యక్షులు-ఉపాధ్యక్షుడు న్యాసరి ఉదయ్ కుమార్ మూలింటి రాము యాదవ్, మంగలి రంగస్వామి బస్నేపల్లి హరినాథ్ గౌడ్, ఐసోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ హుస్సేన్ పీరా, మదనంతపురం శ్రీనివాసులు, విఠోబా తాలూక మహిళా అధ్యక్షురాలు జానకి, మండల అధ్యక్షురాలు గూడూరు కవిత, లక్ష్మీదేవి, నాగరాజ్ పాల్గొన్నారు.