Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Maddikera: వైభవంగా కొండప్ప స్వామి రథోత్సవం

Maddikera: వైభవంగా కొండప్ప స్వామి రథోత్సవం

రద్దీగా సాగిన రథోత్సోవం

మండల పరిధిలోని ఎం అగ్రహారం గ్రామ శివారు ప్రాంతంలో వెలిసిన అవధూత కొండప్ప స్వామి తొమ్మిదో వార్షికోత్సవ రథోత్సవం వేడుకలు వైభవంగా జరిగాయి. శనివారం ఉదయం గణపతి పూజ, అభిషేకాలు, అర్చనలు, గంగపూజ నిర్వహించి అనంతరం స్వామివారినీ మేళతాళాలతో బీరప్ప డొల్లుల వాయిద్యాల మధ్య ఉత్సవమూర్తిని గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. సాయంత్రం మోళగవల్లి పక్కిరమ్మ, పక్కిరప్ప, నివాసం నుండి బోనాలు ఊరేగింపు అనంతరం అశేష భక్త జనవాహిని మధ్య, స్వామి వారి రథోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో భక్తులకు అన్న వితరణ చేశారు రథోత్సవం పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి ముక్కలు చెల్లించుకున్నారు రథంపై అరటి పళ్ళు వేస్తూ భక్తిని చాటుకున్నారు.

- Advertisement -

ఈ వేడుకలలో ప్రజాప్రతినిధులు ప్రజలు నిర్వాహకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కన్నుల పండుగ వలె బుగ్గ సంగమేశ్వర రథోత్సవం సాగింది. జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న బుగ్గ సంగమేశ్వరుని రథోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది శివరాత్రి మరుసటి రోజు ఆనాదిగా వస్తున్న రథోత్సవ వేడుకలను కార్యనిర్వాకుల ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు నిర్వహించారు. ఉదయం శివ పార్వతులకు ప్రత్యేక పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. శివలింగంపై గంగ పూజ నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటలకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల మధ్య స్వామి వారి రథోత్సవాన్ని నిర్వహించారు. బుగ్గ సంగమేశ్వరం భక్తులతో కిటకిటలాడింది.

ఈ కార్యక్రమంలో ఇటు కర్నూలు, అనంతపురం జిల్లాల భక్తులు తరలి రావడంతో దేవాలయ ప్రాంగణంలో అన్న వితరణ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News