ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం జగన్ ప్రభుత్వమేనని పత్తికొండ శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవి అన్నారు. మద్దికేరలోని మూడో సచివాల పరిధిలో ఉన్న రైతు భరోసా కేంద్రం 2 విలేజ్ హెల్త్ సెంటర్ లను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జడ్పిటిసి మురళీధర్ రెడ్డి ఎంపీపీ అనిత యాదవ్ ఆధ్వర్యంలో మాట్లాడుతూ వైసిపి నాలుగేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే కాకుండా ఎంతో మంది నిరుపేద చిన్నారులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలను అందించిన ఘనత సీఎం జగన్ కి దక్కుతుందని ఆమె అన్నారు. గ్రామ గ్రామాన అన్ని విధాల సేవలు అందాలనే ఉద్దేశంతో ప్రతి పంచాయతీ పరిధిలో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ సెంటర్లు పాల కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి కార్యాలయానికి సొంత భవనం ఉండాలని దేశంతో కోట్లు వెచ్చించి నిర్మాణాలు చేపట్టామని వాటిని దశలవారీగా ప్రారంభిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కువ చూసిన మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారని ఇది తప్పక నెరవేరుతుందన్నారు ప్రతిపక్షాలు గతంలో పాలన సమయంలో ఎటువంటి అభివృద్ధి చేయకపోగా ప్రజలకు సేవలు అందజేయడంలో రోజులుగా గడిచేవని ఆరోపించారు వాలంటరీ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అవాతాతలకు ప్రతినెల 1వ తేదీ తెల్లవారుజామునే ఇళ్ల దగ్గరికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్నారని వారి సేవలు ఎంతో అవసరం అన్నారు మద్దికెరలో 57లక్షలతో ప్రభుత్వ భవనాలు సచివాలయం -3 పరిధి లోని 21 లక్షల 80 వేల రూపాయలతో నూతనంగా పూర్తి అయిన రైతుభరోసా -3 కేంద్రము ను మరియు సచివాలయం -2,3 పరిధి లోని 35 లక్షలతో నూతనంగా గ్రామంలో నిర్మించిన ఆరోగ్య కేంద్రాలను,రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..
అనంతరం ఖరీఫ్ సీజన్ మొదలవక ముందే గ్రామస్థాయిలో రాయితీపై విత్తనములు పంపిణీ అర్హులైన రైతులకు రాయితీ పై వేరుశనగ విత్తనాలను శాసనసభ్యులు కంగాటి శ్రీదేవమ్మ* చేతుల మీదుగా రైతులకు అందజేశారు.. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ రేలంపాడు వెంకటేశ్వర్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ కుమ్ములూరి పకీరప్ప ఎంపీడీవో నరసింహమూర్తి మాజీ ఎంపీపీ మల్లికార్జున యాదవ్ మాజీ సర్పంచ్ కొత్తపేట వెంకటేశ్వర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యులు డి శ్రీనివాస్ యాదవ్ మండల ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి మద్దికేర సహకార సంఘం చైర్మన్ శాంతన్న తోపాటు వివిధ గ్రామాల నాయకులు రామలింగారెడ్డి సర్పంచ్ కారుమంచి మల్లికార్జున ఉపసర్పంచ్ ఆముదాల గోపాల్ భద్రయ్య పంచాయతీ కార్యదర్శి శ్రీహరి తదితరులు ఉన్నారు.