Monday, January 6, 2025
Homeఆంధ్రప్రదేశ్Madhavi Latha: ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మాధవీలత

Madhavi Latha: ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మాధవీలత

టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత(Madhavi Latha)స్పందించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు.

- Advertisement -

‘వయసైపోయిన పెద్ద మనిషి మాట్లాడిన భాషకు ధన్యవాదాలు. ఆయనకు సపోర్ట్ చేస్తున్న వారికి సంతాపం. నన్ను చంపాలనుకుంటే వెంటనే చంపేయండి. కానీ, మహిళల మాన, ప్రాణ సంరక్షణ విషయంలో ఎప్పుడూ వెనక్కి తగ్గను. ఒంటరిగానైనా పోరాటం చేస్తాను. సినిమాల్లో ఉన్నవాళ్లంతా ప్రాస్టిట్యూట్లని ఆయన మాట్లాడారు. కాబట్టి ఆయన జిల్లాను నుంచి ఎవరూ ఇండస్ట్రీకి రావొద్దు’ అని మాధవీలత సూచించారు.

అంతకుముందు ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సత్య కుమార్ యాదవ్(Satya Kumar) సీరియస్ అయిన సంగతి తెలిసిందే. కాగా మాధవీలత ఒక ప్రాస్టిట్యూట్ అని.. ఆమెను బీజేపీలో ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదని ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News