కూటమి ప్రభుత్వం మరో కీలక పోస్టు భర్తీ చేపట్టింది. ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ను నియమించింది. వరంగల్ నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా ఉన్న ప్రొఫెసర్.మధుమూర్తిని విద్యామండలి ఛైర్మన్‌గా నియమిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్న మధుమూర్తి.. వచ్చే ఏడాది జరగనున్న ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌పై దృష్టి పెట్టనున్నారు.
AP News: ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా మధుమూర్తి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES