టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుని అక్రమ అరెస్టు, జైల్లో అక్రమ నిర్బంధం ను నిరసిస్తూ, తమ అధినేత చంద్రబాబు త్వరలో నిర్దోషిగా బయటకు రావాలని , ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ తెలుగు యువత పట్టణ అధ్యక్షులు ప్రభు కుమార్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా మహానందిలోని నందీశ్వరుని దేవాలయం నందు గురువారం ప్రత్యేక పూజలు చేయించినట్లు వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ టిడిపి నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మండ్రా శివ నంద రెడ్డి, నందికొట్కూరు సమన్వయకర్త గౌరు వెంకటరెడ్డి ఆదేశాల మేరకు తెలుగు యువత ఆధ్వర్యంలో నందికొట్కూరు నుంచి బయలుదేరి ప్రసిద్ధ ఆలయమైన మహానందిలో వెలిసిన నందీశ్వరుని ఆలయంలో చంద్రబాబు ఆరోగ్యంగా, క్షేమంగా త్వరలో బయటికి రావాలని ఆకాంక్షిస్తూ పూజల కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం సైకో పోవాలి సైకిల్ రావాలి, అని ప్లక్కార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశమన్నారు . వైసిపి ప్రభుత్వ కుట్ర పూరిత కక్షలో భాగంగా తమ అధినేత చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించి జైల్లో నిర్బంధించారని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం నిస్వార్ధంగా పనిచేసిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. నేడు రాష్ట్రంలో అరాచక పాలన పై తెలుగుదేశం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబు పై అక్రమ కేసులు బనాయించారని ఆరోపిస్తూ ఇది తగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు సాయి, సతీష్, హరికృష్ణ, కలాం, షేక్షా తదితరులు పాల్గొన్నారు.
Mahanandi: చంద్రబాబు కోసం అభిమానుల ప్రత్యేక పూజలు
మహానందిలో చంద్రబాబు కోసం ప్రత్యేక పూజలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES