Friday, January 23, 2026
Homeఆంధ్రప్రదేశ్Malapati Bhaskar Reddy: వైసీపీ నేత భాస్కర్‌ రెడ్డి పోలీసు కస్టడీ పొడగింపు!

Malapati Bhaskar Reddy: వైసీపీ నేత భాస్కర్‌ రెడ్డి పోలీసు కస్టడీ పొడగింపు!

మహిళలపై సామాజిక మాధ్యమాలలో (Social Media) అసభ్యకర పోస్టు పెట్టిన వైసీపీ నేత, ఎన్నారై మాలపాటి భాస్కర్ రెడ్డి (Malapati Bhaskar Reddy)ని కస్టడీకి కోర్టు అనుమతించింది. 2 రోజలు పాటు కస్టడీకి తీసుకుని విచారించవచ్చని పేర్కొంది. విచారణలో భాగంగా అతడిని నెల్లూరు జిల్లాల్లో ప్రశ్నించనున్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ (Dy.CM Pawan Kalyan)తో పాటు టీడీపీ(TDP), జనసేన (Janasena) పార్టీకి చెందిన మహిళలపై అసభ్యకర పోస్టు పెట్టిన కేసులో భాస్కర్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే రిమాండ్‌కి తరలించారు. ప్రస్తుతం భాస్కర్‌ రెడ్డి నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుని మరింత విచారించాలని కోర్టుకు పోలీసులు అభ్యర్థించారు. దీంతో కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది.

- Advertisement -

Also Read: Satyakumar: జైలుకు జగన్ ఖాయం.. కోర్టు విచారణను బల ప్రదర్శనగా మార్చారంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర విమర్శలు

భాస్కర్‌ రెడ్డి లండన్‌లో నివసస్తూ సోషల్ మీడియాలో గత మూడు సంవత్సరాలుగా అసభ్యకర పోస్టులు పెడుతున్నాడు. అతడు కృష్ణా జిల్లాలోని పెనమలూరు మండలం చోడవరానికి చెందినవాడు. తన తండ్రి మరణించడంతో కొద్దిరోజుల క్రిత సొంతూరుకు వచ్చాడు. దీంతో అతడిపై టీడీపీ కార్యకర్తలు కొందరు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ నెల 21 వరకు భాస్కర్‌ రెడ్డిని రిమాండ్‌కు తరలించారు. అయితే తాజాగా తన రిమాండ్ గడువు ముగిసింది దీంతో భాస్కర్ రెడ్డిని కోర్టులో ప్రవేశ‌పెట్టారు. పోలీసుల అభ్యర్థన మేరకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో కోర్టు రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News