Thursday, March 6, 2025
Homeఆంధ్రప్రదేశ్Nara Lokesh: 'మనమిత్ర' సేవలు 200కు పెంపు: లోకేశ్

Nara Lokesh: ‘మనమిత్ర’ సేవలు 200కు పెంపు: లోకేశ్

కూటమి ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో వాట్సప్ గవర్నెన్స్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సేవల ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. తొలి దశలో వాట్సప్ ద్వారా 161 పౌరసేవలను ప్రభుత్వం అందిస్తోందతి. ప్రజా వినతులు స్వీకరించడంతో పాటు అవసరమైన సమాచారాన్ని కూడా 9552300009 ద్వారా అందిస్తోంది. తాజాగా ఈ సేవలను 200కు పెంచినట్లు మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) తెలిపారు.

- Advertisement -

ఈ ఏడాది జనవరిలో 161 సేవలతో ప్రారంభించిన ‘మనమిత్ర’ అనతి కాలంలోనే 200 సేవలు అందించే అద్భుతమైన మైలురాయి సాధించిందన్నారు. ఏపీలో డిజిటల్‌ గవర్నెన్స్‌ శక్తికి ఇదో నిదర్శనమని చెప్పారు. పౌర సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా పారదర్శకతను పెంచుతుందని అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News