Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Bhuma family: కొత్తూరులో సందడి చేసిన సినీ హీరో మంచు మనోజ్ దంపతులు

Bhuma family: కొత్తూరులో సందడి చేసిన సినీ హీరో మంచు మనోజ్ దంపతులు

గృహప్రవేశంలో సందడి చేసిన భూమా కుటుంబం

రుద్రవరం మండల పరిధిలోని కే కొత్తూరు గ్రామంలో సినీ హీరో మంచు మనోజ్ మౌనిక రెడ్డి దంపతులు సందడి చేశారు. గ్రామానికి చెందిన భూమా నర్సిరెడ్డి కుమారుడు డాక్టర్ నరసింహారెడ్డి ఆహ్వాన మేరకు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి సినీ నటుడు మంచు మనోజ్ మౌనిక దంపతులు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భార్గవ్ రామ్ దంపతులు, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా కిషోర్ రెడ్డి, భూమా విఖ్యాత్ రెడ్డి, ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబుతో పాటు భూమా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

- Advertisement -

గ్రామంలోకి చేరుకున్న భూమా అఖిలప్రియ దంపతులు భూమా మౌనిక దంపతులు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, భూమా కిషోర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి భూమా కుటుంబ సభ్యులు మేళతాళాలతో ఘన స్వాగతం పలుకగా వారు ముందుగా గ్రామంలోని రామాలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ భూమా నరసింహారెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని భూమా కుటుంబ సభ్యులను బంధువులను పలకరిస్తూ ప్రేమగా ఆప్యాయతలు పంచుకున్నారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన సినీ హీరో మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డినిను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంచు మనోజ్ మౌనికా రెడ్డి దంపతులు అభిమానులకు అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరించడంతో గ్రామంలో సందడి నెలకొంది. గృహప్రవేశ కార్యక్రమం సందర్భంగా భూమా కుటుంబం అంతా ఒక్కటవ్వడంతో ఒకరినొకరు పలకరించుకుంటూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకొని సంతోషాలను పంచుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News