Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Mandous Cyclone Update : తీవ్ర తుపానుగా మాండూస్.. అతి భారీవర్షాలు, విమాన సర్వీసులు రద్దు

Mandous Cyclone Update : తీవ్ర తుపానుగా మాండూస్.. అతి భారీవర్షాలు, విమాన సర్వీసులు రద్దు

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను మరింత బలపడి తీవ్రతుపానుగా మారిందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం ఈ తుపాను తమిళనాడులోని కారైక్కాల్ కు తూర్పు ఆగ్నేయంగా 420, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఈ తుపాను క్రమంగా పశ్చిమ వాయవ్యదిశగా పయనించి తుపానుగా బలహీనపడుతుందని, 9వ తేదీ రాత్రి పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య తీరాన్ని దాటి మహాబలిపురం వద్ద భూభాగంపై ప్రవేశిస్తుందని భారత వాతావరణ విభాగం వివరించింది. గడిచిన 7 గంటలుగా ఈ తీవ్ర తుపాను గంటకు 12 కిమీ వేగంతో కదులుతోంది.

- Advertisement -

మాండూస్ తుపాను ప్రభావంతో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నేడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. తుపాను తీరం దాటేంతవరకూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు ఈ నెల 10వ తేదీ వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అలాగే తీరంవెంబడి గాలుల తీవ్రత కూడా పెరుగుతుందని, ఫలితంగా చలిగాలులు పెరుగుతాయని తెలిపింది.

తుపాను కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. చెన్నై నుండి సింగపూర్, ముంబై వెళ్ళాల్సిన 11 విమానాల దారి మళ్లించారు. అలాగే తూత్తూకుడి, షిరిడీకి వెళ్లే నాలుగు విమానాలు రద్దు చేశారు. అలాగే భారీ వర్షసూచన నేపథ్యంలో తిరువళ్లూరు, తంజావూరు, చెంగల్పట్టు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News