Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Mandous Cyclone Update : నిజాంపట్నం పోర్టులో రెండో ప్రమాద హెచ్చరిక, అధికారులతో సీఎం సమీక్ష

Mandous Cyclone Update : నిజాంపట్నం పోర్టులో రెండో ప్రమాద హెచ్చరిక, అధికారులతో సీఎం సమీక్ష

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను ఆ తుపాను తీవ్ర తుపానుగా రూపాంతరం చెందింది. తుపాను ప్రభావంతో.. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఏపీతో పాటు తమిళనాడులో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని తిరువళ్లూరు, తంజావూరు, చెంగల్పట్టు జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. చెన్నై నుండి తూత్తుకుడి, షిరిడీకి వెళ్లే నాలుగు విమానాలు రద్దు చేశారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ లో అధికారులు రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

- Advertisement -

ఏపీలో తుపాను పరిస్థితిపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మాండూస్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అలర్ట్ గా ఉండాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే పునరావాస కేంద్ర తరలింపుపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని అధికారులకు సూచించారు. తుపాను పట్ల రైతులకు కూడా అవగాహన కల్పించాలని, రైతు సహాయకారిగా ఉండాలని జగన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చూడాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News