Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Mandous Cyclone: తీవ్ర తుపానుగా మారిన 'మాండూస్'.. తీరం దాటేది ఇక్కడే!

Mandous Cyclone: తీవ్ర తుపానుగా మారిన ‘మాండూస్’.. తీరం దాటేది ఇక్కడే!

- Advertisement -

Mandous Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాన్ బలపడి తీవ్ర తుఫానుగా మారింది. చెన్నైకి 440 కిమీ దూరం ఉన్న ఈ తుఫాను శుక్రవారం అర్ధరాత్రి తమిళనాడులోని మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొత్తం 210 మండలాల్లో తుఫాన్ ప్రభావం ఉండనున్న నేపథ్యంలో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది.

మాండోస్ తీవ్ర తుపాను దాదాపు 12 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా వెళ్లి నైరుతి మీదుగా పయనిస్తోంది. శ్రీలంకలోని ట్రింకోమలీకి ఉత్తర-ఈశాన్యంగా 240 కి.మీ., జాఫ్నాకు 270 కి.మీ తూర్పు-ఈశాన్య (శ్రీలంక), కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 270 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంలో 350 కి.మీ. వద్ద కేంద్రీకృతమై ఉంది. మాండోస్‌ పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం వద్ద తీరం దాటనుండగా.. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలపై ప్రభావం చూపనుంది.

శుక్రవారం అర్ధరాత్రి గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మాండూస్ తుపాను ప్రభావంతో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. తుపాను తీరం దాటేంతవరకూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరంవెంబడి గాలుల తీవ్రత కూడా పెరుగుతుందని, ఫలితంగా చలిగాలులు పెరుగుతాయని తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News