ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో అవుకు మండలం మంగంపేట తాండ గ్రామానికి చెందిన 15 గిరిజన కుటుంబాలు టిడిపి పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరారు. మంగంపేట తండా గ్రామానికి చెందిన పితావత్ గోవింద్, పితావత్ మల్లి నాయక్, పితావత్ రవి నాయక్, కుర్ర వెంకటరమణ నాయక్, శ్రీరామ్ నాయక్ ,వెంకటేష్ నాయక్, శంకర్ నాయక్, రాంల నాయక్ ,కిట్టు నాయక్ ,తులసి నాయకులను వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ,కాటసాని ఓబుల్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ బనగానపల్లె నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంతో వాటికి ఆకర్షితులై వారు టిడిపి పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా గిరిజన గ్రామాల్లో వారికి ప్రభుత్వ భూముల పట్టాలు ఇప్పించి వారు సాగు చేసుకునేటట్లు చేపట్టడం జరిగిందని చెప్పారు. నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అలాంటి నాయకుడిని మళ్ళీ 2024 సంవత్సరంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా మనం అఖండ మెజార్టీతోముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగాతననుగెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో మంగంపేట తండా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మద్దిలేటి నాయక్, తిరుపాల్ నాయక్, పరశురాం నాయక్, బీజా నాయక్, బాలు స్వామి నాయక్, బీజా మద్దిలేటి నాయకులు తదితరులు పాల్గొన్నారు.