Saturday, December 28, 2024
Homeఆంధ్రప్రదేశ్National Mourning: దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత: సీఎం చంద్రబాబు,...

National Mourning: దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత: సీఎం చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్

సంతాపం

దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత… శ్రీ మన్మోహన్ సింగ్ గారు

- Advertisement -

భారత దేశ మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. భారత దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యులలో ఒకరు శ్రీ మన్మోహన్ సింగ్ గారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, యూజీసీ ఛైర్మన్ గా విశిష్ట సేవలందించిన ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. శ్రీ మన్మోహన్ సింగ్ గారు హయాంలో చేపట్టిన సంస్కరణల వల్ల మన ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కింది. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. శ్రీ మన్మోహన్ సింగ్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి
ఆంధ్ర ప్రదేశ్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News