Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: దేవుడి దర్శనానికి వచ్చి..నదిలో శవాలుగా తేలారు!!

Mantralayam: దేవుడి దర్శనానికి వచ్చి..నదిలో శవాలుగా తేలారు!!

Kurnool News: కర్నూలు జిల్లా మంత్రాలయంలో శనివారం విషాద ఘటన జరిగింది. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చిన తర్వాత ముగ్గురు కన్నడిగులు చనిపోయారు. ఏడుగురు స్నేహితులు శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి రాగా.. పుణ్యస్నానాలు ఆచరించేందుకు తుంగభద్ర నది వద్దకు వెళ్లారు. స్నానం చేస్తున్న క్రమంలో కాలు జారి ఓ స్నేహితుడు నీటిలో మునిగిపోయాడు. అతడ్ని కాపాడేందుకు ఇద్దరు వెంటనే నీటిలోకి దూకారు. అలా ముగ్గురు స్నేహితులు నీటిలో మునిగి ప్రాణాలు విడిచారు. మరో నలుగురు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.

- Advertisement -

ఏం జరిగిందంటే?
అయితే వీరంతా కర్ణాటకలోని హాసన్ జిల్లాకి చెందిన ఒకే కాలేజికి చెందిన స్టూడెండ్స్ కావడం గమనార్హం. వీరంతా డిగ్రీ చదువుతున్నారు. రెండు రోజుల సెలవుల నేపథ్యంలో వారంతా కలిసి మంత్రాలయం వచ్చారు. శుక్రవారం రాత్రి హాసన్ నుంచి బయలుదేరిన వీరు శనివారం ఉదయం మంత్రాలయం చేరుకొని.. శ్రీ రాఘవేంద్ర స్వామని దర్శించుకున్నారు.

తిరుగు ప్రయాణంలో సాయంత్రం వేళ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వెనుక భాగంలో ఉన్న పుష్కర ఘాట్‌లో పుణ్య స్నానం కోసం తుంగభద్ర నది ఒడ్డుకు వెళ్లారు. ఏడుగురు స్నేహితులు కలిసి నదిలోపలకి వెళ్లారు. ఈ క్రమంలో ఒకరి కాలు జారి వరద ప్రవాహానికి నీటిలో మునిగిపోయాడు. అతడ్ని కాపాడేందుకు పోయిన మరో ఇద్దరు కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇలా అజిత్, సచిన్, ప్రమోద్.. ముగ్గురు నీటిలో మునిగి ప్రాణాలు విడిచారు. మిగిలిన నలుగురు ప్రాణాలతో ఒడ్డుకు వచ్చేశారు. ప్రాణ మిత్రులు నదిలో గల్లంతు అవ్వడం వల్ల కన్నీరు మున్నీరుగా విలపించారు. వీరి స్నేహితుల మరణంతో తుంగభద్ర తీరం సోకసంద్రంగా మారింది.

ముమ్మరంగా గాలింపు..

తుంగభద్రలో గల్లంతైన ముగ్గురి ఆచూకీ కోసం కర్నూలు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం సాయంత్రానికి వారి ఆచూకీ దొరకొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. నదిలో వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల పుట్టిల ద్వారా అధికారులు, రెస్క్యూ టీమ్, మత్స్యకారులు విరివిగా గాలిస్తున్నారు. బాధితుల కుటుంబాలకు సమాచారం ఇచ్చిన తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad