పెద్దకడబూరు మండలంలోని చిన్న తుంబలం గ్రామంలో మంత్రాలయం నియోజకవర్గం శాసనసభ్యులు వై. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు రెండవ రోజు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం రాష్ట్ర యువజన నాయకులు వై.ప్రదీప్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి,రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, మండల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా గజమాలతో పూలు వర్షాలు కురిపించి వై. ప్రదీప్ రెడ్డిని గ్రామంలోకి స్వాగతించారు. ప్రతి ఇంటి గడపకి ఆప్యాయత అనురాగాల మధ్య పలకరించి వారికి ఇచ్చిన బుక్ లేటు ద్వారా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని కుటుంబ యజమానులను అడిగి, ఆరా తీసి, గ్రామంలోని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఇంటి గడపకు వెళ్లి తెలిపారు. గ్రామంలో కాలనీ ప్రజలు సమస్యలను తమ దృష్టికి తీసుకొని రాగా ఎమ్మెల్యే కి తక్షణమే చెప్పి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని గ్రామ కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని సచివాలయం సిబ్బందికి వాలంటీర్లకు తెలియజేశారు. రాబోయే 2024 ఎలక్షన్లో వైయస్. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రతి ఇంటి గడపలో తెలియజేస్తూ మంత్రాలయం ఎమ్మెల్యేగా మళ్లీ వై. బాలనాగిరెడ్డిని ఆదరించాలని గ్రామ ప్రజలకు తెలిపారు.
ఈ కార్యక్రమంలోఎంపీడీవో శ్రీనివాసరావు, తాసిల్దార్ వీరేంద్ర గౌడ్, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి,మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి,రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, దొడ్డి మేకల సర్పంచ్ చంద్రశేఖర్,రవిచంద్ర రెడ్డి,గజేంద్ర రెడ్డి, సొసైటీ అధ్యక్షులు మన గారి రవీంద్ర, హనుమాపురం సర్పంచ్ ఈరన్న,వైసిపి సీనియర్ నాయకులు జాము మూకయ్య, విజయేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎల్లప్ప,తెలుగు చిన్న వీరేష్,డీలర్ కడుబూరి, బ్రహ్మయ్య,లక్ష్మన్న, సచివాలయ కన్వీనర్ అడ్వకేట్ అంజనప్ప,పెద్ద వీరేష్,స్కూల్ కమిటీ చైర్మన్ బొడ్డన్న,మదిరి రాముడు, హుసేని,యోహాను, ఇస్సాకు,సాదిక్, ప్రభుదాస్,వీరేష్, గంగప్ప,రమేష్, మల్లయ్య,వివిధ శాఖకు సంబంధించిన అధికారులు,గ్రామ సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.