మంత్రాలయం మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రాత్రి 3 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వాన చినుకులు పడ్డాయి. మంత్రాలయం, మాధవరం, కల్లుదేవకుంట, చిలకలదోన, వగరూరు తదితర గ్రామాల్లో మంచి వర్షం కురిసింది. దీంతో పొలాల్లో నీరు నిలిచాయి. అలాగే చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చిలకలడోన్ నుంచి బుదురుకు వెళ్ళే దారిలో రెండు చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి. దానికి ఆనుకొని ఉన్న మట్టి, తారు రోడ్డు కొట్టుకు పోయి గుంతగా ఏర్పడ్డాయి. ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. ఎన్నికల ముందు రూ. 2.50 కోట్లతో 16 కిలో మీటర్లు జలవాడి రహదారిని మరమ్మతు పనులు పూర్తయ్యాయి. వర్షానికి వి. తిమ్మాపురం దగ్గరలో వగుపై ఉన్న కల్వర్టు దగ్గర రోడ్డు కొట్టుకు పోయింది. పెద్ద ఎత్తున మట్టి, కంకర, తారు కొట్టుకుపోవడంతో ప్రమాదకరం మారింది.
Mantralayam: మంత్రాలయం రోడ్డులో భారీ వర్షం
జాలవాడి రోడ్డుకు కోత
సంబంధిత వార్తలు | RELATED ARTICLES