విజయవాడ మంగళగిరి పార్టీ కేంద్రాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , ఇన్చార్జిల తో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు.
నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు, తాగు నీటితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలను సీఎంను కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించారని ఇన్చార్జి తెలిపారు. ఈ సంద్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు సమావేశం లో మాట్లాడుతూ .. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తామని ప్రజలకు ధైర్యం బాధ్యత ప్రతి ఎమ్మెల్యే ఉందని, దీపావళి నుంచి ఉజ్తా గ్యాస్ సిలిండర్ ల అమలు చేస్తామని, ఎక్కువ సమస్యలన్నీ గ్రీవెన్స్ భూ సమస్యలే వస్తున్నాయని అందుకే లాంటెట్టింగ్ యాక్టర్ రద్దు చేశాం. ఇప్పటికే 175 అన్న క్యాంటీన్లను ప్రారంభించాం వాటిని 203గా పెంచుతాం. ఎమ్మెల్యేలు ఇన్చార్జిలు, హోదాలో ఉన్న వారైనా సరే పార్టీకి చెడ్డపేరు వస్తే ఎంత వ్యక్తినైనా సహించేదే లేదని చెప్పారు. 2029 లో మీరంతా గెలిచి అసెంబ్లీలో రావాలని తాపత్రయపడుతున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు.