Tuesday, September 10, 2024
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Mantralayam: తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి

కర్ణాటక రాష్ట్రం లోని తుంగభద్ర డ్యాం 19వ గేటు ఛైన్ లింక్ తెగి వరద నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయింది. దీంతో డ్యాం నుంచి దాదాపు 50 వేల క్యూసెక్కుల మేర నీరు దిగువకు వస్తున్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి మీడియా ద్వారా తెలిపారు.

- Advertisement -

కర్నూలు జిల్లాలోని కౌతాళం, కోసిగి, మంత్రాలయం, నందవరం, సి. బెళగల్ మండలాల్లోని తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంతే కాకుండా పంట పోల్లాలో పైర్ల సాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసుకున్న మోటార్లును ఒడ్డున ఏర్పాటు చేసుకోవాలని అన్నదాతలకు సూచించారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News