Homeఆంధ్రప్రదేశ్Holidays: విద్యార్థులకు అదిరిపోయే న్యూస్‌.. మార్చిలో సెలవులే సెలవులు

Holidays: విద్యార్థులకు అదిరిపోయే న్యూస్‌.. మార్చిలో సెలవులే సెలవులు

March 2026 School Holidays:ఫిబ్రవరి నెల ముగింపు దశకు చేరుకుంటుండగా విద్యార్థుల దృష్టి ఇప్పుడు మార్చి నెలపై పడింది. వేసవి సెలవులకు ముందు ఉండే ఈ నెలలో పండుగలు, వారాంతాలు కలిసి పలు రోజులు విద్యాసంస్థలకు సెలవులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తం లెక్క వేస్తే మార్చి నెలలో సుమారు పది రోజుల వరకు విరామం లభించే పరిస్థితి ఉంది.

- Advertisement -

మార్చి ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఆ రోజు సహజంగానే పాఠశాలలు, కాలేజీలు మూసివేస్తారు. ఆ తర్వాత మార్చి నాలుగో తేదీన హోలీ పండుగ జరగనుంది. హోలీ సందర్భంగా సాధారణంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తారు.

మార్చి 14వ తేదీ రెండో శనివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాల్లాగే స్కూళ్లు, కాలేజీలకు కూడా ఆ రోజు సెలవు ఉంటుంది. అదే నెలలో మార్చి 19న ఉగాది పండుగ జరగనుంది. తెలుగు నూతన సంవత్సర ఆరంభంగా భావించే ఈ పండుగ రోజున విద్యాసంస్థలు పనిచేయవు.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-inter-public-exams-2026-from-february-23/

రంజాన్ పండుగ…

రంజాన్ పండుగను నెలవంక కనిపించిన తేదీ ఆధారంగా జరుపుకుంటారు. ప్రస్తుత అంచనాల ప్రకారం మార్చి 20న రంజాన్ జరగనుంది. ఆ రోజు కూడా విద్యార్థులకు సెలవు ఉంటుంది. అలాగే మార్చి 26న శ్రీరామనవమి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో విద్యాసంస్థలు మూసివేస్తారు.

ఆప్షనల్ హాలీడే…

మార్చి 31న మహావీర్ జయంతి సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ఆప్షనల్ హాలీడే ఇస్తారు. ఈ అన్ని పండుగలతో పాటు ఆదివారాలు, రెండో శనివారాన్ని కలుపుకుంటే మార్చి నెలలో విద్యార్థులకు కనీసం పది రోజుల వరకు విరామం దక్కే అవకాశముంది.

ఒంటిపూట బడులు..

ఇక మరోవైపు వేసవి వేడిని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. మార్చి 16వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల విద్యాశాఖలు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశాయి.

ఆంధ్రప్రదేశ్ లో మార్చి 16 నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు తరగతులు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అయితే పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల్లో మధ్యాహ్నం 1 గంట తర్వాత తరగతులు నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ..

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు కూడా మార్చి 16 నుంచే ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ ఒకటో తేదీ వరకు కొనసాగనున్నాయి. పరీక్షల నేపథ్యంలో సంబంధిత పాఠశాలల్లో ప్రత్యేక షెడ్యూల్ అమలు చేస్తారు.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/home-minister-vangalapudi-anita-fries-bajji-in-upmaka/

మొత్తంగా చూస్తే మార్చి నెలలో పండుగలు, వారాంతాలు, ఒంటిపూట బడులు, పదో తరగతి పరీక్షలతో విద్యార్థులకు మారిన షెడ్యూల్ అమల్లోకి రానుంది. వేసవి సెలవులకు ముందు ఈ నెలలోనే విద్యార్థులు పలు రోజులు విరామం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News