Homeఆంధ్రప్రదేశ్Srisailam: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు.. అప్రమత్తమైన అధికారులు

Srisailam: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు.. అప్రమత్తమైన అధికారులు

Srisailam: ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి ఏకంగా 1,74,711 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని బట్టి అధికారులు జలాశయ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

జలాశయం నీటిమట్టం వివరాలు: ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయానికి సంబంధించిన వివరాలు ఇలా నమోదయ్యాయి.

  • ప్రస్తుత నీటిమట్టం: 846.10 అడుగులు
  • నీటి నిల్వ సామర్థ్యం: 72.1974 టీఎంసీలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News