Friday, January 31, 2025
Homeఆంధ్రప్రదేశ్Mega handloom park: మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్క్

Mega handloom park: మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్క్

కంచి తరహాలో హ్యాండ్లూమ్ పార్కు

మంగళగిరిలోని ఆటో నగర్ ను ఆనుకుని మెగా హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత-జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. చేనేత కార్మికులకు 365 రోజులు భృతి కల్పించే లక్ష్యంలో భాగంగా ఆ పార్కు ఏర్పాటుకు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
అప్పట్లో స్వర్ణయుగమే

- Advertisement -

బుధవారం మంగళగిరిలోని ఆటోనగర్ కు ఆనుకుని ఉన్న 10.80 ఎకరాలను చేనేత జౌళిశాఖ కమిషనర్ రేఖారాణితో కలిసి మంత్రి సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గడిచిన అయిదేళ్లు చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమూ అందకపోవడంతో పాటు ఉత్పత్తి అయిన వస్త్రాలు విక్రయించే మార్కెట్ సదుపాయం లభించకపోవడంతో, ఎందరో నేతన్నలు అప్పుల పాలయ్యారన్నారు. కొందరు చేనేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారని విచారం వ్యక్తంచేశారు. టీడీపీ పాలనలో చేనేతలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న సమయం చేనేతకు స్వర్ణయుగమన్నారు. 2014-19లో చేనేతల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. నూలు కొనుగోలుకు రాయితీ అందజేశారని, ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించారని మంత్రి గుర్తు చేశారు. వాటితో పాటు ముద్ర రుణాలతో పాటు త్రిఫ్ట్ పథకం అమలు చేశారన్నారు. ఆనాటి ప్రయోజనాలతో పాటు మరికొన్ని కొత్త పథకాలను నేతన్నలకు అందివ్వాలని సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ నిర్ణయించారని మంత్రి తెలిపారు.

చేనేతలకు 365 రోజుల పనే లక్ష్యం

నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు,మంత్రి లోకేశ్ కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి సవిత తెలిపారు. దీనిలో భాగంగా ప్రభుత్వపరంగా ఆర్థిక దన్ను అందించడంతో పాటు 365 రోజుల పాటు పని కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గడిచిన ఏడు నెలల కాలంలో రాష్ట్రంతో పాటు దేశంలోని పలు నగరాల్లో చేనేత బజార్లు ఏర్పాటు చేసి, చేనేత వస్త్రాల విక్రయాలు పెరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో నూతన టెక్స్ టైల్స్ పాలసీకి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీవర్ శాలలతో పది నూతన క్లస్టర్లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. హ్యాండ్లూమ్, టెక్స్ టైల్స్ పార్కుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖలో 5 ఎకరాల్లో యూనిటీ మాల్ ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు

మంగళగిరిలోని ఆటో నగర్ లో మెగా హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటుకు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ చర్యలు చేపట్టారని మంత్రి సవిత తెలిపారు. 10.80 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేయబోతున్నామన్నారు. తమిళనాడులోని కంచి తరహాలో హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 365 రోజుల పాటు చేనేత కార్మికులకు పని కల్పించాలన్న లక్ష్య సాధనలో భాగంగానే ఈ హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేయనున్నామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News