Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Michaung cyclone alert: మిచౌంగ్ తుఫాను నేపధ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Michaung cyclone alert: మిచౌంగ్ తుఫాను నేపధ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అందరూ జాగ్రత్తగా ఉండండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

- Advertisement -

మిచౌంగ్ తుఫాను నేపధ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తుఫానుకు ముందు

• పుకార్లను నమ్మవద్దు, ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దు.
• అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకుంటూ ఉండండి, వాతావరణ హెచ్చరికలు కోసం SMS లను గమనిస్తు ఉండండి.
• రేడియో/టీవీ న్యూస్ చూడండి, వార్తాపత్రికలు చదవండి.
• మీ పత్రాలు/సర్టిఫికెట్స్ మరియు విలువైన వస్తువులను వాటర్ ప్రూఫ్ కంటైనర్లు/కవర్ లో ఉంచండి.
• ఖాళీ గదిలో ఉండటానికి ప్రయత్నించండి. అదేవిధంగా వస్తువులు కదలకుండా ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోండి.
• భద్రత మరియు మనుగడ కోసం అవసరమైన వస్తువులతో “అత్యవసర వస్తు సామగ్రిని” సిద్ధం చేసుకోండి.
• మీ ఇంటిని ముఖ్యంగా పైకప్పును భద్రపరచుకోండి, ఏమైనా మరమ్మతులు ఉంటే చేపట్టండి, ఇంట్లో పదునైన వస్తువులను వదులుగా ఉంచవద్దు.
• పశువులు / జంతువులను పూర్తిగా వాటికి కట్టిన తాడును విప్పి వాటిని వదిలివేయండి
• తుఫాను ఉప్పెన / ఆటుపోట్ల హెచ్చరిక లేదా వరదలు వచ్చినప్పుడు, మీ సమీప సురక్షితమైన ఎత్తైన భూమి / సురక్షితమైన ఆశ్రయం పొందండి. దానికి సురక్షితమైన మార్గం ను తెలుసుకోండి.
• కనీసం ఒక వారం పాటు ఉండటానికి తగినంత ఆహారం మరియు నీరు నిల్వలను సిద్ధం చేసుకోండి.
• మీ కుటుంబం కోసం మరియు సంఘం కోసం నిర్వహించే కృత్రిమ విపత్తులు(మాక్ డ్రిల్స్) / శిక్షణ తరగతులలో పాల్గొనండి.
• స్థానిక అధికారుల అనుమతితో మీ ఇంటి దగ్గర చెట్ల కొమ్మలను కత్తిరించండి.
• తలుపులు మరియు కిటికీలను సురక్షితంగా మూసివేయండి.
• ప్రభుత్వ అధికారులు సూచించిన వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెంటనే వెళ్ళండి.

తుఫాను సమయంలో

ఇంట్లో ఉంటే

• ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి, అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలు మరియు గ్యాస్ కనెక్షలను తీసివేయండి.
• తలుపులు మరియు కిటికీలు మూసివేసి ఉంచండి.
• మీ ఇల్లు సురక్షితం కాకపోతే, తుఫాను ప్రారంభం కాకముందే సురక్షితమైన ఆశ్రయం/షెల్టర్ కు చేరుకోండి.
• రేడియో న్యూస్ వినండి,అధికారిక హెచ్చరికలపై మాత్రమే ఆధారపడండి.
• వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు మాత్రమే త్రాగాలి.
• భవనం కూలిపోవటం జరుగుతుంటే,దుప్పట్లు, రగ్గులు లేదా దుప్పట్లతో లేదా బలమైన టేబుల్ లేదా బెంచ్ కిందకు దూరడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోండి.

బయట ఉంటే

• దెబ్బతిన్న/పాత భవనాల్లోకి ప్రవేశించవద్దు.
• వీలైనంత త్వరగా సురక్షితమైన ఆశ్రయం/షెల్టర్ కు చేరుకిండి.
• చెట్టు / విద్యుత్ స్తంభం కింద ఎప్పుడూ నిలబడకండి.
• వాతావరణం ప్రశాంతం గా ఉంటే జాగ్రత్త గా నిశితంగా వేచి చుడండి, తుఫాను ముగిసిందని అనుకోకండి,ఒక్కసారిగా పెద్ద/హింసాత్మక గాలులు మరొక దిశ నుండి తిరిగి ప్రారంభమవవచ్చు, అధికారిక ఉత్తర్వులు ‘ఆల్ క్లియర్’ అని వచ్చెంతవరకు సహనంతో ఉండండి.

తుఫాను తరువాత

• వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు మాత్రమే త్రాగాలి.
• అధికారికంగా సమాచారం వచ్చేవరకు బయటకు వెళ్లవద్దు, మిమ్మల్ని షెల్టర్/ఆశ్రయం లొ ఉంచినట్లయితే అధికారులు చెప్పేవరకు తిరిగి వెళ్ళవద్దు.
• విరిగిన విద్యుత్ స్తంభాలు మరియు వదులుగా ఉండే తీగలు/తెగిన తీగలు మరియు ఇతర పదునైన వస్తువుల నుండి జాగ్రత్తలు తీసుకోండి.
• దెబ్బతిన్న/పడిపోయిన భవనాల్లోకి ప్రవేశించవద్దు.
• దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను/వస్తువులను వాడే ముందు వాటిని ఎలక్ట్రీషియన్ చేత తనిఖీ చేయంచండి.

మత్స్యకారులు చేయవలసినవి

• పుకార్లను నమ్మకండి, ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దు.
• మొబైల్ ఫోన్లను అత్యవసర సమయం లో వాడుటకు/కమ్యూనికేషన్ కు ఎప్పుడూ ఛార్జ్ చేసి ఉంచండి, SMS లను చూస్తూ ఉండండి
• ముఖ్యమైన ఫోన్ నంబర్స్ ను కాగితంపై వ్రాసి సురక్షితంగా ఉంచండి.
• అదనపు బ్యాటరీలతో రేడియో ను మీతో ఉంచుకోండి
• వాతావరణ సమాచారం/హెచ్చరికల కోసం,రేడియో న్యూస్ వినండి, టీవీ చూడండి,వార్తాపత్రికలు చదవండి
• పడవలు / తెప్పలను సురక్షితమైన ప్రాంతం లో కట్టి ఉంచండి.
• సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News