రాష్ట్రంలో అణగారిన వర్గాలకు సైతం రాజ్యాధికారం ఇచ్చింది కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా స్పష్టం చేశారు. ఆళ్లగడ్డ లో మంగళవారం ప్రారంభమైన వైసిపి సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొనేందుకు ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎంలు అంజాద్ భాష, స్వాములు నారాయణ స్వామి, విజయనగరం పార్లమెంటు సభ్యుడు బెళ్ళాన చంద్రశేఖర్ లకు ఏపీ జల వనరుల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి వైసిపి నాయకులు ఘన స్వాగతం పలికారు.
స్థానిక మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో బీసీ క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ సంబంధించిన వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తమకందాయని అమ్మ ఒడి విద్యా దీవెన తదితర వాటి గురించి వివరంగా వివరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతే జగన్మోహన్ రెడ్డి ఆశయం అన్నారు. అనంతరం 200 మంది బీసీ మైనారిటీ నాయకులతో కలిసి ఆ పంక్తి భోజనం చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం అంజాద్ భాష మాట్లాడుతూ కార్యకర్తనైన తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రెండో పర్యాయం గెలిచిన తరువాత ఒక మైనారిటీ అయిన తనకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి వెన్ను తట్టి ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు.
స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు సంవత్సరాలు అయిందని కానీ ఇంతవరకు వచ్చిన ఏ ప్రభుత్వం , ముఖ్యమంత్రి కూడా సామాజిక న్యాయం అనే పదానికి నిర్వచనం చెప్పలేదని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా అణగారిన సామాజిక వర్గాలకు సైతం పెద్దపీట వేసి మంత్రివర్గంలో సైతం నలుగురు బీసీలకు ప్రాతినిధ్యం కల్పించిన ఘనత ఆయనకే దక్కిందని అంజాద్ భాష పేర్కొన్నారు. మరో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తన మామ .. మహా పురుషుడు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి రాజకీయాలలోకి వచ్చే ముఖ్యమంత్రి అయ్యారన్నారు.