Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Agriculture Budget: రూ.43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్

AP Agriculture Budget: రూ.43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్

AP Agriculture Budget| ఏపీ శాసనసభ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఐదు నెలల కాలానికి రూ. 2.94 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు కాగా.. రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు, ద్రవ్యలోటు రూ.68,743 కోట్లుగా ప్రతిపాదించారు. సూపర్ సిక్స్ హామీలు, సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు.

- Advertisement -

ఈ బడ్జెట్ అనంతరం వ్యవసాయ, పశుసంవర్దక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) రూ. 43,402 కోట్ల వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అచ్చెన్న బడ్జెట్ ప్రతులను చదివి సభకు వినిపించారు. గత వైసీపీ పాలనలో రైతులకు పంటల బీమా అందలేదని విమర్శించారు. ఇకనూ రాష్ట్రంలోని ప్రతి రైతుకు వడ్డీలేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక అని.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం వ్యవసాయానికి నిర్దిష్టమైన ప్రణాళిక అవసరమని అన్నారు.

వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు ఇలా..

ఎన్టీఆర్ జలసిరి – రూ.50 కోట్లు
అన్నదాత సుఖీభవ – రూ.4,500 కోట్లు
రైతు సేవా కేంద్రాలకు – రూ.26.92 కోట్లు
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ – రూ.14,637.03 కోట్లు
ఎరువుల సరఫరా – రూ.40 కోట్లు
పొలం పిలుస్తోంది – రూ.11.31 కోట్లు.
ప్రకృతి వ్యవసాయం – రూ.422.96 కోట్లు
డిజిటల్‌ వ్యవసాయం – రూ.44.77 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ – రూ.187.68 కోట్లు
పంటల బీమా – రూ.1,023 కోట్లు
వ్యవసాయ శాఖ – రూ.8,564.37 కోట్లు
ఉద్యాన శాఖ – రూ. 3469.47 కోట్లు
పట్టు పరిశ్రమ – రూ.108.4429 కోట్లు
వడ్డీ లేని రుణాలకు – రూ.628 కోట్లు
రాయితీ విత్తనాలకు – రూ.240 కోట్లు
భూసార పరీక్షలకు – రూ.38.88 కోట్లు
విత్తనాల పంపిణీ – రూ.240 కోట్లు
ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ – రూ.44.03 కోట్లు
వ్యవసాయ మార్కెటింగ్ – రూ.314.80 కోట్లు
సహకార శాఖ – రూ.308.26కోట్లు
శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం – రూ.171.72 కోట్లు
మత్స్య విశ్వవిద్యాలయం – రూ.38 కోట్లు
పశుసంవర్ధక శాఖ – రూ.1,095.71 కోట్లు
ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం – రూ.507.038 కోట్లు
ఉద్యాన విశ్వవిద్యాలయం – రూ.102.227 కోట్లు
మత్స్య రంగం అభివృద్ధి – రూ.521.34 కోట్లు
ఉచిత వ్యవసాయ విద్యుత్ – రూ.7241.30 కోట్లు
ఉపాధి హామీ అనుసంధానం – రూ.5,150కోట్లు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News