మహానటి సావిత్రి అంటే.. ఆనాటి తరం వారికే కాదు.. ఈ తరంలోనూ తెలియని వారుండరు. సహజంగా నటిస్తారనే కంటే.. జీవిస్తారు అనడం మేలు. ప్రతి పాత్రలోనూ ఒదిగిపోయి తనకంటూ ప్రత్యేక అభిమానుల్ని సంపాదించుకున్న గొప్ప నటి సావిత్రి. ఆమె జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘటనలను చిత్రంగా మలిచి.. మహానటి పేరుతో సినిమా తీసి.. అందరికీ ఆమె గురించి చాటిచెప్పారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఒకరికి పెట్టే గుణమే తప్ప.. తీసుకోవడం తెలియని సావిత్రి.. జీవిత చరమాంకంలో దుర్భర జీవితాన్ని అనుభవించారు. అలాంటి సమయంలోనూ ఆమె ఎవరినీ సాయం అడగపోవడం ఆమె గొప్పతనం. అనారోగ్యంతో ఏడాదిపాటు కోమాలో ఉండి 46 ఏళ్ల వయసులో కన్నుమూశారామె.
అలాంటి వ్యక్తి గురించి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక ప్రెస్ మీట్ లో అనరాని, చెప్పరాని, రాయరాని మాట అన్నారు. పవన్ కల్యాణ్ మీటింగ్ లకు వచ్చే జనాల గురించి మాట్లాడుతూ.. సినిమా నటులు వస్తే.. వందలు, వేలమంది వస్తారని చెబుతూ.. ఉదాహరణకు సావిత్రి…..వచ్చినా అలాగే వస్తారన్నారు. అక్కడ మంత్రి వాడిన ఓ పదం సావిత్రి అభిమానులతో పాటు.. నెటిజన్లకు కోపం తెప్పించింది. కనీసం ఆ తర్వాత ఆయన ఆ పదాన్ని పదధ్యానంలో వాడాను , వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పకపోవడం గమనార్హం. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సావిత్రి గారిని అంతమాట అంటావా అంటూ.. బొత్స సత్యనారాయణను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటోళ్లు విద్యాశాఖ మంత్రి కావడం మా ఖర్మ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
https://www.instagram.com/reel/CkBhJh3B4pl/?utm_source=ig_web_copy_link