Thursday, October 3, 2024
Homeఆంధ్రప్రదేశ్Minister Buggana busy in Bethamcharla: బేతంచర్లలో బిజీగా మంత్రి బుగ్గన

Minister Buggana busy in Bethamcharla: బేతంచర్లలో బిజీగా మంత్రి బుగ్గన

అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో మంత్రి

బేతంచెర్ల పట్టణంలోని 5వ సచివాలయాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. రూ.40 లక్షలతో సకల సదుపాయాలతో నిర్మించిన సచివాలయం అందుబాటులోకి రావడంతో సంబంధిత వార్డు ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందుతాయని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలోని 5 వ సచివాలయ ప్రారంభోత్సవ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పూజ కార్యక్రమాల అనంతరం స్థానిక ప్రజలతో మంత్రి బుగ్గనరాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడారు.

- Advertisement -

మంత్రి వీధుల్లో కలియ తిరుగుతూ ఆప్యాయంగా ప్రజలను పేరుపేరుతో పలకరిస్తూ పాదయాత్ర చేశారు. ఇప్పటికే మౌలిక సదుపాయాలన్ని బేతంచెర్లలోపట్టణంలో ఏర్పాటైన నేపథ్యంలో,ఇంకా ఏవైనా ఇబ్బందులన్నాయా అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు బేతంచెర్ల క్యాంప్ కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరి స్థానిక ప్రజలను పలకరిస్తూ స్థానిక ఆలయాలను దర్శించుకున్నారు. అమ్మవారి శాల, అయ్యప్ప,ఆంజనేయ, చెన్నకేశవ, మాధవ ఆలయాలలోని పూజా కార్యక్రమాలలో మంత్రి బుగ్గన భాగస్వామ్యమయ్యారు. అమ్మవారి శాలలో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి వేదపండితుల ఆశీర్వచనం పొందారు.

ఆలయ మర్యాదలతో మంత్రి బుగ్గనను పట్టువస్త్రంతో సత్కరించి, ప్రసాదం అందజేశారు. ఆ తర్వాత రూ.3.70 కోట్లతో జరుగుతున్న కందకం డ్రైనేజీ కాలువ అభివృద్ధి పనులను మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పరిశీలించారు.బేతంచెర్ల పట్టణానికి కీలకమైన ఈ పనులను వేగంగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బేతంచెర్ల ‘ఊరి వాకిలి’ అభివృద్ధికి చొరవ తీసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ సీ.హెచ్ చలం రెడ్డిని ఆదేశించారు. కందకం పక్కన కోట లచ్చమ్మ ఆలయానికి స్థలం కేటాయించాలని స్థానిక మహిళలు మంత్రి బుగ్గనకు విజ్ఞప్తి చేశారు. కందకం పూర్తి అయిన తర్వాత దృష్టిసారిద్దామని సానుకూలంగా స్పందించారు. అనంతరం బేతంచెర్ల మార్కెట్ యార్డు అభివృద్ధి పనులను పరిశీలించారు. రూ.60 లక్షలతో నిర్మిస్తున్న మార్కెట్ యార్డు మౌలిక సదుపాయాలపై కాంట్రాక్టర్ కు పలు సూచనలతో ఆదేశాలిచ్చారు. అంతకుముందు బేతంచెర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గోరుగుట్ట ఆటో యూనియన్ డ్రైవర్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ని కలిశారు. ఇటీవల వాహనమిత్ర అందించడం పట్ల సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బేతంచెర్ల నగర పంచాయితి ఛైర్మన్ సీ.హెచ్ చలం రెడ్డి, మద్దిలేటి స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ బి. సీతారామచంద్రుడు, వైసీపీ సీనియర్ నాయకులు బాబు రెడ్డి, బీరవోలు నాగేశ్వర్ రెడ్డి ఆర్యవైశ్య సంఘ నాయకులు,గుండా జగన్ మోహన్, కందగడ్డలమోహన్, కె. రామ్ముర్తి,బి. చంద్ర మౌళిశ్వర్ రెడ్డి, బేతంచెర్ల మండల తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి,నగర పంచాయితి కమిషనర్ రమేష్ బాబు బేతంచెర్ల పట్టణ వార్డుకౌన్సిలర్ సభ్యులు, వైసిపి నాయకులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News