ఏపీలో విద్యుత్ ఛార్జీలు(Current Charges) పెరగనున్నాయని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో గృహ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని వాపోతున్నారు. ఈ క్రమంలో కరెంట్ ఛార్జీల పెంపు వార్తలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravi Kumar) స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో ఛార్జీలు పెంచమని స్పష్టం చేశారు.
అలాగే భవిష్యత్తులో కూడా ఛార్జీలను పెంచే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు. కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాల్లో భాగంగా కావాలనే కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని గొట్టిపాటి విజ్ఞప్తి చేశారు.