హోళగుంద మండలం ఇంగళదాహల్ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపాధి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఆలూరు తాలూకా ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ ప్రమిదావతమ్మతో కలిసి మంత్రి నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించారు.
అనంతరం గడప గడప కార్యక్రమంలో బీసీ కాలనీలో గ్రామస్తులు డ్రైనేజీలు లేక రోడ్డు మీద మురుగు ఎటూపోలేని పరిస్థితి ఏర్పడిందని ఇలాంటి మరుగు రోడ్డులో అడుగు వేసేది ఎలా అంటూ, అద్వానంగా ఉన్న ఈ రోడ్లకు మీరే ఓ దారి చూపించాలని గ్రామస్తులు కోరారు. వెంటనే మంత్రి 20 లక్షలతో గ్రామంలో అధ్వానంగా ఉన్న రోడ్లను, డ్రైనేజీలను నిర్మించాలని ఆదేశించారు. తాగునీటి కోసం సంపు నిర్మించడానికి, ప్రతి ఇంటికి కుళాయిలు వెయ్యడానికి 44 లక్షల రూపాయల మంజూరయ్యాయని తెలిపారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరింస్తూ తమ దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడ వచ్చిన అధికారులకు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బావ శేషప్ప,సింగిల్ విండో సొసైటీ చైర్మన్ మల్లికార్జున,మండల కన్వీనర్ షఫీ ఉల్లా, గ్రామ సర్పంచ్ భర్త వెంకటరామిరెడ్డి,ఎంపీపీ తనయుడు ఈసా,ఎంపిటిసి మల్లికార్జున, వైసీపీ సీనియర్ నాయకులు ప్రహల్లాద రెడ్డి,వైసిపి నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు,సీఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.