రైతు సంక్షేమ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఉపాధి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. దేవనకొండ మండలంలోని గుండ్లకొండ, ఎం.కె కొట్టాల గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి గుమ్మనూరు జయరాం జోరు వర్షంలో ప్రజలతో మమేకం అయి.. ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి గడప గడపకు వైసీపీ ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎక్కడో ఉన్న మండల కేంద్రంలో కాకుండా గ్రామాల్లోనే పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారని, రైతులు విత్తనాలు ఎరువులకు ఇబ్బందులు పడకుండా ఉండడానికి రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. రైతు సంక్షేమానికి ప్రతి ఏటా పంటల బీమా, రైతు భరోసా కింద పరిహారం అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఉచితంగా ప్రతి ఒక్కరికి సంబంధించిన సర్టిఫికేట్స్ అందిస్తున్నాము అన్నారు. ఎం.కె కొట్టాల గ్రామంలో స్మశానానికి కాంపౌండ్ కట్టించాలని కోరారు. ఎస్.ఐ భూపాలుడు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో గుమ్మనూరు సోదరులు శ్రీనివాసులు, నారాయణస్వామి, తహసీల్దార్ వెంకటేష్ నాయక్, ఎంపీడీఓ గౌరీదేవి, ఏ.ఓ సురేష్ బాబు, ఏపీఎం రమేష్, ఏ.పి.ఓ కృష్ణమూర్తి, ఈఓపిఆర్డీ సూర్యనారాయణ, ఎం.ఈ.ఓ తిమ్మారెడ్డి, మండల జడ్పిటిసి కిట్టు, ఎంపీపీ లక్ష్మీదేవి భర్త లుముంబా, వైసిపి మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున, వైస్ ఎంపీపీ అశోక్, వైసిపి మండల నాయకులు మోహన్ రెడ్డి, ప్రేమ్ నాథ్ రెడ్డి, నిజల్ రెడ్డి, నారాయణరెడ్డి,మదన్ మోహన్ రెడ్డి, నారాయణ రెడ్డి, గఫుర్, ప్రతాప్, రామచంద్ర, కబీర్, ఆనంద్ పాల్గొన్నారు.