Homeఆంధ్రప్రదేశ్Nara Lokesh: రష్యాలో పర్యటిస్తున్న నారా లోకేష్‌.. ఏపీలో స్మార్ట్ సిటీల అభివృద్దిపై కీలక ఒప్పందం

Nara Lokesh: రష్యాలో పర్యటిస్తున్న నారా లోకేష్‌.. ఏపీలో స్మార్ట్ సిటీల అభివృద్దిపై కీలక ఒప్పందం

Minister Lokesh holds key meeting in Russia: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్‌ రష్యాలో పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని సేఫ్ అండ్ స్మార్ట్ సిటీల నిర్వహణ కోసం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రష్యాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్.. సెయింట్ పీటర్స్‌బర్గ్‌ ప్రభుత్వ రీజనల్ ఫారిన్ ఎఫైర్స్ విభాగం చీఫ్ ఎక్స్‌పర్ట్ పోలినా పోలుఖినాతో ఒప్పందం కుదుర్చకున్నారు. ఈ భేటీలో ఒక ఉమ్మడి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేష్ స్వయంగా వెల్లడించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు నారా లోకేష్ వివరించారు.

- Advertisement -

Also Read: Dharmapuri Arvind: మీ వైఫల్యాలను కేంద్రంపై నెట్టొద్దు.. సీఎం రేవంత్‌కు ధర్మపురి అర్వింద్‌ సూచన

స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి రష్యా సహకారం..

ప్రధానంగా సేఫ్ అండ్‌ స్మార్ట్ సిటీల నిర్మాణం కోసం పౌరులతో చర్చలు జరపడం, డేటా ఆధారిత నగర నిర్వహణ, డిజిటల్ విద్యను ప్రోత్సహించడం, నగరాల్లో విశ్వసనీయమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఏపీలో స్మార్ట్ సిటీల అభివృద్ధి, నిర్వహణకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం, అనుభవాన్ని పంచుకునేందుకు ఈ ఉమ్మడి వర్కింగ్ గ్రూప్ దోహదపడుతుందని, ఈ సహకారంతో రాష్ట్రంలోని నగరాలను మరింత సురక్షితంగా, ఆధునికంగా తీర్చిదిద్దేందుకు మార్గం సుగమం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశంలోనే అగ్రగామి నగరాలు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేయవచ్చని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News