Minister Lokesh: ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. శనివారం ఉదయం విజయవాడకు చేరుకున్న లోకేశ్.. నేరుగు దుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో శీనా నాయక్, పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, పాలకమండలి సభ్యులు మంత్రి లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్న లోకేశ్: అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనం అందించారు. అమ్మవారి శేష వస్త్రంతో పాటు ప్రసాదాలను అందజేశారు. అనంతరం అక్కడి భక్తులతో లోకేశ్ కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు లోకేశ్ తెలిపారు.

