Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Ration Cards: త్వరలోనే కొత్త రేషన్ కార్డులు: నాదెండ్ల

Ration Cards: త్వరలోనే కొత్త రేషన్ కార్డులు: నాదెండ్ల

ఏపీ అసెంబ్లీ(AP Assembly) బడ్జెట్ సమావేశాలు ఆరో రోజు కొనసాగుతున్నాయి. త్వరలో క్యూఆర్‌ కోడ్‌తో రేషన్ కార్డులు(Ration Cards) ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈకేవైసీ అమలులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. సభలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు నాదెండ్ల సమాధానం ఇచచారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థీకృతంగా రైస్ స్మగ్లింగ్ మార్చేసిందన్నారు. అక్రమ రవాణా అరికట్టడానికి సివిల్ సప్లైస్ చట్టాలు, పీడీ యాక్టులలో సవరణలు తెచ్చి చట్టాలలో మార్పులు తెచ్చామన్నారు.

- Advertisement -

కాకినాడ పోర్టులో 50 వేల మెట్రిక్ టన్నులు సీజ్ చేసి.. 25 మెట్రిక్ టన్నులు పీడీఎస్ రైస్‌గా గుర్తించామని చెప్పారు. ఈకేవైసీ, ఏఐ కెమెరాల సహాయంతో అక్రమ రవాణాను అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. గత ఐదేళ్ల కాలంలో రేషన్ బియ్యానికి సంబంధించిన లెక్కలు తీస్తున్నామని చెప్పుకొచ్చారు. మచిలీపట్నం గోడౌన్లతో పాటు కాకినాడ, బేతంచర్ల గోడౌన్లకు సంబంధించి తనిఖీలు జరుగుతున్నాయని వివరించారు. త్వరలో అన్ని విషయాలు బయటికి వస్తాయని నాదెండ్ల వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad