AP ECET Results 2026: ఏపీ ఈసెట్-2026 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ పరీక్షలో మొత్తం 91.72 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. ఈసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులందరికీ మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా బీటెక్, బీఈ కోర్సుల ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు ప్రతి ఏటా ఈసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఈసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 23న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 32,434 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 29,750 మంది అర్హత సాధించారు.
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-visit-in-kodangal-constituency/
ఫలితాలు, ర్యాంకు కార్డులను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని విద్యాశాఖ కల్పించింది. దీంతో పాటు వాట్సాప్ ద్వారా కూడా విద్యార్థులు ర్యాంకు కార్డును పొందవచ్చు. తమ ఫోన్‌లోని వాట్సాప్ నుంచి 9552300009 నంబర్‌కు సందేశం పంపి మీమీ ఫలితాలు తెలుసుకోవచ్చు.

