విజయనగరం జిల్లాలో పిల్లలు చదువులో వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన బొబ్బిలి మండలం పెంట జడ్పీ స్కూల్ హెచ్ఎం రమణ. మేము కొట్టలేము,తిట్టలేము అంటూ ప్రధానోపాధ్యాయుడు గుంజిళ్ళు తీశారు. వాస్తవమే కదా పిల్లలను కొడతానే తల్లిదండ్రులు మరియు “విద్యార్థి సంఘం నాయకులు” కుల సంఘం” నాయకులు ఉపాధ్యాయులపై దాడి కేసులు నమోదు చేస్తారన్నారు.
విద్యార్థులను కొట్టే పరిస్థితి లేదని తనకు తాను శిక్ష వేసుకున్నారు ఈ హెడ్ మాస్టర్. విద్యార్థులకు సాష్టాంగ నమస్కారం పెట్టి ఆ తరువాత గుంజీలు కూడా తీశారు. మేం కొట్టలేము, తిట్టలేము, ఏమి చేయలేము అని స్టూడెంట్స్ ముందు గుంజీలు తీయటంతో విద్యార్థులు వద్దు సర్ మేము మాట వింటామని కేకలు పెట్టారు.
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చింత రమణ పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని .. విద్యార్థులను దండించకుండా, గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చిందని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
హెడ్మాస్టరు గారూ! అంతా కలిసి పనిచేసి, ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయక్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది. అభినందనలు. అంతా కలిసి విద్యాప్రమాణాలు పెంచుదాం. పిల్లల విద్య, శారీరక, మానసిక వికాసానికి కృషిచేసి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని పిలుపునిచ్చారు.