Thursday, March 27, 2025
Homeఆంధ్రప్రదేశ్Tidco Houses: టిడ్కో ఇళ్లను త్వరలోనే అందజేస్తాం: మంత్రి నారాయణ

Tidco Houses: టిడ్కో ఇళ్లను త్వరలోనే అందజేస్తాం: మంత్రి నారాయణ

టిడ్కో ఇళ్ల(Tidco Houses)పై అసెంబ్లీ వేదికగా మంత్రి నారాయణ(Narayana) కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో టిడ్కో ఇళ్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు నారాయణ సమాధానం ఇచ్చారు. లబ్ధిదారులు బ్యాంక్‌ లోన్ వడ్డీలు కట్టలేక, అద్దె ఇళ్లల్లో ఉండలేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. లబ్ధిదారులకు వెంటనే టిడ్కో ఇళ్లను కేటాయించాలని సభ్యులు కోరారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. 2014-19 హయాంలో 7 లక్షలకు పైగా ఇళ్లు టిడ్కోలో మంజూరు అయ్యాయన్నారు. అందులో 4లక్షలకు పైగా ఇళ్లకు టెండర్లు పిలిచామన్నారు.

- Advertisement -

అయితే వాటిలో గత వైసీపీ ప్రభుత్వం కొన్ని ఇళ్లు రద్దు చేసిందని తెలిపారు. ఇల్లు ఇవ్వకుండానే 77 వేల మంది లబ్ధిదారులపై లోన్ తీసుకున్నారని మండిపడ్డారు. ఇక కొన్ని ఇళ్లను రద్దు చేసి వేరేవారికి కేటాయించిందన్నారు. ఇందుకు సంబంధించి కూడా మార్పులు చేస్తాం అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రూ.140 కోట్లు బ్యాంక్ లోన్ కట్టాలని.. త్వరలోనే ఈ లోన్ కట్టేస్తాన్నారు. జూన్ 12 నాటికి పెండింగ్‌లో ఉన్న ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News