Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Nimmala: కుమార్తె వివాహానికి సీఎం చంద్రబాబును ఆహ్వానించి మంత్రి నిమ్మల

Nimmala: కుమార్తె వివాహానికి సీఎం చంద్రబాబును ఆహ్వానించి మంత్రి నిమ్మల

Nimmala: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కుమార్తె వివాహానికి కుటుంబసమేతంగా హాజరు కావాల్సిందిగా ఆయన్ని ఆహ్వానించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల తన కుమార్తె శ్రీజ వివాహ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఈనెల 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈ వివాహ వేడుక జరగనుందని ఆయన ముఖ్యమంత్రికి తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి తనను వ్యక్తిగతంగా ఆహ్వానించిన మంత్రి నిమ్మల రామానాయుడుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీలో మంత్రి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Read Also: Xi Jinping: డీఎన్ఏ దొక్కుండా.. కిమ్ కూర్చున్న చైర్ ని ఎలా తుడిచారో చూడండి..!

బాలకృష్ణకు ఆహ్వానం

అంతకుముందు, ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna)ను మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) కలిశారు. ఈ నెల 24న పాలకొల్లులో జరగబోయే తన కుమార్తె శ్రీజ వివాహానికి రావాలని ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో బాలయ్యను కలిసి పెళ్లి శుభలేఖను అందజేశారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. వివాహ తేదీ, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్న బాలకృష్ణ.. ‘వస్తాను.. ఎట్లా వస్తా ఏంటనేది చెప్పను’ అంటూ నవ్వులు పూయించారు. అదే సమయంలో సినీ దర్శకుడు బోయపాటి శ్రీను సైతం అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా వారిమధ్య చోటుచేసుకున్న సంభాషణ వీడియోను మంత్రి ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు.

Read Also: Railway: ఆదాయం విషయంలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad