Thursday, March 12, 2026
Homeఆంధ్రప్రదేశ్Free Electricity: నేతన్నలకు గుడ్‌ న్యూస్‌.. ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి ఉచిత విద్యుత్‌.!

Free Electricity: నేతన్నలకు గుడ్‌ న్యూస్‌.. ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి ఉచిత విద్యుత్‌.!

Free Electricity: రాష్ట్రంలో నేతన్నలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. చేనేతలందరికీ ఉచిత విద్యుత్‌ అందిస్తామని.. ఏప్రిల్‌ 1 నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు మంత్రి సవిత శాసనమండలిలో వెల్లడించారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/sports-news/ten-thousand-condoms-used-in-3-days-shortage-reported-in-winter-olympics/

చేనేత వృత్తిలో ఉన్న వారందరినీ అర్హులుగా ప్రకటిస్తూ వారికి ఏప్రిల్‌ 1 నుంచి ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఈ విషయాన్ని శాసనమండలిలో శుక్రవారం ప్రకటించారు. 

మగ్గం నేతన్నలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను వినియోగించుకోవచ్చు. మర మగ్గం నేతన్నలు ప్రతి నెలా 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,03,534 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. నివేదికల ప్రకారం రాష్ట్రంలో 93,000 చేనేత కుటుంబాలు ఉండగా.. 10,534 మర మగ్గాల కుటుంబాలు ఉన్నాయి. 

Also Read: https://teluguprabha.net/national-news/pm-rahat-scheme-launched-rs-1-5-lakhs-cashless-treatment/

ఉచిత విద్యుత్‌ పథకం ద్వారా చేనేత కార్మికులకు ఏడాదికి సుమారు రూ. 8,640, మర మగ్గాల యజమానులకు రూ. 21,600 వరకు ఆదా అవుతుందని మంత్రి తెలిపారు. ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ. 85 కోట్ల అదనపు భారం పడనున్నట్లు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News