ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 18 సం.లోపు స్కూలు విద్యను అభ్యసిస్తున్న తల్లి దండ్రులును కోల్పోయిన, నిరాదరణకు గురైన, నిరాశ్రయులు, నిస్సహాయ అనాథ బాలలను ప్రభుత్వం గుర్తిస్తోంది. అర్హులైన అర్హులైన బాలలకు “మిషన్ వాత్సల్య” స్పాన్సర్ షిప్ పథకం ద్వారా ప్రతీ నెలకు 4,000/- ఆర్థిక భరోసా కల్పిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు తెలిపారు.
రాష్ట్రంలో బాలల రక్షణ, సంరక్షణ దృష్టిలో పెట్టుకొని ఈ పథకం గురించి సంబంధిత మండల, జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేస్తూ రాష్ట్రమంతా అవగాహనా కార్యక్రమాలని చేపడతామన్నారు. గ్రామ/ వార్డ్ స్థాయిలో గల సచివాలయం, ఉపాద్యాయ, అంగన్వాడి , సిబ్బందికి, వాలంటీర్లు, బాలల కోసం పనిచేస్తున్న ఇతర సిబ్బంది ఇందులో భాగస్వామ్యం కావాలని ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన బాలలు ఈ నెల 15 వ తేదీ లోపు దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తే వాటిని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పరిశీలించి, అర్హత ఉన్న బాలల వివరాలను రాష్ట్ర స్థాయి అధికారులకు తెలిపి, మంజూరు చేయిస్తామన్నారు.