HomeTop StoriesMLA Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ రాజీనామా.. శాసనసభ విప్‌ పదవి నుంచి...

MLA Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ రాజీనామా.. శాసనసభ విప్‌ పదవి నుంచి జౌట్.. కారణం అదేనా?

MLA Arava Sridhar resigns Whip: రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ తన శాసనసభ విప్‌ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కలిసి ఈ మేరకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. తనపై గతంలో వచ్చిన ఆరోపణలు, నెలకొన్న వివాదాలపై వివరణ ఇచ్చారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైతం పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. ఎమ్మెల్యే బాలరాజు పనితీరుపై పవన్‌ సమీక్ష జరిపారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులపై వివరణ కోరారు. 4 వారాల్లో పరిస్థితిని చక్కదిద్దుకోవాలని సూచించారు. అదే విధంగా నియోజకవర్గానికి ఇచ్చిన రూ. 147 కోట్ల పనుల పురోగతిపైనా ఆరా తీశారు. పనులు ఎందుకు పూర్తి కాలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. అధికారుల సమన్వయంతో పనులు వేగంగా పూర్తి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

- Advertisement -

Also read: TPCC chief Mahesh Goud: ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్లు తొలగిస్తే ఊరుకోం.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌

వరుస వివాదాల్లో అరవ శ్రీధర్‌..

అయితే, అరవ శ్రీధర్‌ రాజీనామా వెనుక ఉన్న కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. అరవ శ్రీధర్‌ లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అంతేకాదు, వారి మధ్య జరిగిన సంభాషణ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా వరుస వివాదాలతో పార్టీకి తలనొప్పిగా మారిన అరవ శ్రీధర్‌పై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగానే ఆయనపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News