Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: ఎమ్మెల్యే ఆర్థర్ కు ఘనంగా సన్మానం

Nandikotkuru: ఎమ్మెల్యే ఆర్థర్ కు ఘనంగా సన్మానం

152 సచివాలయాలు, 90 వేల గృహాలు, 162 రోజుల్లో పూర్తి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వ’ కార్యక్రమాన్ని 152 సచివాలయాలు 162 రోజుల్లో 90,050 కుటుంబాలను సందర్శించి, 17 కోట్ల 20 లక్షల సచివాలయాలకు మంజూరు చేయించి దిగ్విజయంగా ఎమ్మెల్యే ఆర్థర్ పూర్తి చేసుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పట్టణంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే ఆర్థర్ పార్టీ శ్రేణులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజవర్గ నలుమూలలో నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఆర్థర్ అభిమానులు సమక్షంలో భారీ కేకు కట్ చేసి సంబరాలు చేస్తున్నారు. అనంతరం వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఆర్థర్ కు మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బాని, కౌన్సిలర్స్ జాకీర్ హుస్సేన్, ఉండవల్లి ధర్మారెడ్డి, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షుకూర్మియా, గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ గంగిరెడ్డి రమాదేవి, డాక్టర్ వనజ, సర్పంచ్ కొంగర నవీన్ , వైసిపి నాయకులు పెరుమల జాన్, తమ్మడపల్లె విక్టర్, దామగట్ల ఎసూ రత్నం , ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటరమణ మరియు వివిధ గ్రామాల వైఎస్ఆర్సిపి నాయకులు పూలమాలలు వేస్తూ దుశ్యాలువులతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందించారని పేర్కొన్నారు. ఇంకా ప్రభుత్వం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

- Advertisement -

సీఎం జగనన్న ఇచ్చిన ఆదేశాలతో ఎంతో నిబద్ధతతో 152 సచివాలయాలను 162 రోజుల్లో పూర్తి చేయడం జరిగిందని, ఇంత దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి వైసిపి పార్టీ శ్రేణుల సహకారంతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. సీఎం జగనన్న గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజల ఇబ్బందులు తెలుసుకోవడమే కాకుండా గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి సచివాలయానికి 20 లక్షల చొప్పున నిధులు కేటాయించడంతో ఎంతో మేలు జరిగిందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ముందుకెళ్లి ప్రజలు విన్నవించిన పలు సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశామని ఇంతటి మహోత్తరమైన కార్యక్రమం నాకు చాలా సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఇంతటి చక్కటి పరిపాలన అందిస్తున్న సీఎం జగనన్న పై ప్రజల ఆశీర్వాదం పార్టీ కార్యకర్తల నాయకుల దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జంగాల పెద్దన్న, వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పైపాలెం ఈనాయాతుల్లా, నాగార్జున ప్రసాద్, ఎస్సీ ఎస్టి విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ మెంబర్ దిలీప్ రాజు, శాతనకోట వెంకటేష్, అయ్యన్న, పగిడ్యాల మండల నాయకులు చిట్టి రెడ్డి, దుద్యాల రఫీ, లక్ష్మాపురం బుసిగౌడ్, రాజన్న, వివిధ మండలాల, గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News