Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Sreedevamma: పెరటి కోళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Sreedevamma: పెరటి కోళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

అదనపు ఆదాయానికి పెరటి కోళ్లు

వెల్దుర్తి మండల కేంద్రమైన వెల్దుర్తి మహిళ సమాఖ్య అఫీస్ ప్రాంగణంలో లబ్ధిదారులకు పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు పత్తికొండ శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ. ఈ కార్యక్రమంలో మహిళలకు జీవనోపాధులలో భాగంగా వెల్దుర్తి మండలానికి100 యూనిట్లను, కృష్ణగిరి మండలానికి 50 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఒక్కో పెరటి కోళ్ల యూనిట్ ధర 3,150/- ప్రతి బాక్స్ లో ఒక్కో యూనిట్ కు 8 పెట్టలు, 3 పూంజులు, మందుల కిట్ ఉంటుంది. ప్రతి మహిళ జీవనోపాధులలో భాగంగా ప్రతి యూనిట్ ద్వారా గుడ్లు, మాంసం విక్రయించుకొని సంవత్సరానికి సుమారుగా రూ 50,000/- ఆదాయం పొందవచ్చునని ఈ అవకాశాన్ని బాలింతలు, రెండు సంవత్సరాల లోపు పిల్లల తల్లులు, మహిళలు తప్పకుండా వినియోగించుకోవలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ నాయకులు, ఎపియం, సిసిలు, వివోఏ లు లబ్ధిదారులు మహిళలు పాల్గొన్నారు….

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News