Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్MLA: గ్రామీణ వైద్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం

MLA: గ్రామీణ వైద్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం

గ్రామీణ వైద్యుల సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తాం

గ్రామీణ వైద్యులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వారి సమస్యల పరిష్కారానికై తోటి శాసనసభ్యులతో చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి గ్రామీణ వైద్యుల సమస్యలను తీసుకెళ్తానని నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణంలోని హోటల్ శోభ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా మహాసభ, నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నంద్యాల శాసనసభ్యులు రవిచంద్ర కిషోర్ రెడ్డి, అతిథులుగా ఆర్ఎంపీడబ్ల్యూఏ రాష్ట్ర అధ్యక్షులు రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎంఎన్ రాజు, ప్రచార కార్యదర్శి దస్తగిరి పర్ల, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నాగేశ్వర్ రెడ్డిని అధ్యక్షులుగా, సురేష్ బాబుని ప్రధాన కార్యదర్శిగా, బేతంచెర్ల నాగ సురేంద్రను కోశాధికారిగా ఏడు మంది ఉపాధ్యక్షులుగా, ఏడు మంది సహాయ కార్యదర్సులుగా దాదాపు 35 మందితో కూడిన నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు రాధాకృష్ణ తెలిపారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ త్వరలో పద్మావతి నగర్ లోని గ్రామీణ వ్యక్తుల సంఘ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సహకారంతో పూర్తి చేస్తామని అలాగే జిల్లాలో మండల స్థాయిల నుంచి కమిటీలు ఏర్పాటు చేసి నంద్యాల జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేసి రాష్ట్రస్థాయిలో గుర్తింపుకు నంద్యాల జిల్లా ముందంజలో ఉండేలా కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎంపి డబ్ల్యూఏ రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు ఉస్మాన్ భాష రఘునాథరెడ్డి నరసింహమూర్తి కృష్ణమూర్తి నాగేశ్వరరావు నంద్యాల నాయకులు యాకూబ్ రమేష్ శ్రీనివాసులు సోహెల్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News