Homeఆంధ్రప్రదేశ్Breastfeeding: తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన అవసరం- ఎమ్మెల్యే సత్యప్రభ  

Breastfeeding: తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన అవసరం- ఎమ్మెల్యే సత్యప్రభ  

శంఖవరం (తెలుగుప్రభ); మాతృ స్తన్యం శిశువులకు అమృత తుల్యం … శిశు జననం అనంతరం ఆరు నెలల వరకు విధిగా తల్లి పాలనే ఇవ్వాలని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పేర్కొన్నారు. శిశువుల ఆరోగ్య కరమైన ఎదుగుదలకు, వెళ్ళి మనో వికాసానికి తల్లి పాలు ఎంతో కీలకమంటూ తల్లి పాల ప్రాధాన్యాన్ని ఆమె వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ, స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలోని మండల కేంద్రం ప్రత్తిపాడు లయన్స్‌ క్లబ్‌ కార్యాలయంలో ప్రత్తిపాడు, శంఖవరం ఐసిడిఎస్ పధకాల సీడీపీవోలు టిడిఆర్‌ పద్మావతి, పర్వత వెంకటలక్ష్మి పర్యవేక్షణలో ఆగస్టు 1-7 ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను శనివారం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. 

- Advertisement -

ఈ సందర్భంగా ప్రత్తిపాడు, శంఖవరం మండలాల గర్భిణీలు, బాలింతలు, తల్లులు, సభికులను ఉద్దేశించి ఎమ్మెల్యే సత్యప్రభ ప్రసంగించారు. ప్రతీ తల్లీ బిడ్డకు పాలిచ్చేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. తల్లి పాల వల్ల శిశువులకు కలిగే ప్రయోజనాలపై తల్లులు, కుటుంబ సభ్యుల్లో నిరంతరం చైతన్యం తీసుకు రావాలని పేర్కొన్నారు. బాలికల ఆరోగ్యం, పోషకాహారం, విద్యపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. బాలికలకు ఉత్తమ విద్యను అందించేందుకు, వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చి దిద్దేందుకు, బాల్య వివాహాల అనర్థాలపై తల్లి, దండ్రులకు వివరించి అవగాహన పెంచాలని, బాల్య వివాహాల రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు, అంగన్‌వాడీ సిబ్బంది, అధికార్లు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. 

breastfeeding week

టీనేజ్‌ గర్భధారణల రహిత నియోజకవర్గంగా ప్రత్తిపాడును తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బేటీ బచావో.. బేటీ పడావో పధకంలో బాలికల రక్షణ, సంరక్షణను, మంచి చదువును ముందుకు కొనసాగించేందుకు సమాజం సహకరించాలి అన్నారు. యువతరానికి మంచి భవిష్యత్తును ఆనందించడానికి, కుటుంబ సంక్షేమానికి, ఆరోగ్య కరమైన కుటుంబాలు, సురక్షితమైన సమాజ నిర్మాణానికి సమష్టిగా కృషి చేయాలని ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యే సత్యప్రభ పిలుపును ఇచ్చారు. బాలికల రక్షణ, సంరక్షణ, ఆరోగ్యం, విద్య, ఉత్తమ భవిష్యత్తుకు ప్రాధాన్యం ఇస్తూ బాల్య వివాహాలు, యుక్త వయస్సు అవివాహిత గర్భధారణల రహిత నియోజకవర్గంగా ప్రత్తిపాడును తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పిలుపును ఇచ్చారు. 

భారత దేశంలో మాదకద్రవ్యాల వ్యతిరేకత, నివారణ కోసం కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ ప్రారంభించిన జాతీయ ప్రచార ఉద్యమమైన నషా ముక్త్ భారత్‌ విస్తృత ప్రచారంతో యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాలని ఎమ్మెల్యే సత్యప్రభ పిలుపు ఇచ్చారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేస్తూ అవగాహన కార్యక్రమాలను నిర్వహించ లన్నారు. యువతలో నవ చైతన్యం తీసుకు రావడంతో పాటు వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని, ఆత్మ హత్యలు లేని సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి నషా ముక్త్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆమె వివరించారు. జన్మ నిచ్చిన తల్లి,దండ్రులకే కాకుండా మొత్తం సమాజానికే యువత బాధ్యతగా ఉండాలని ఎమ్మెల్యే సత్యప్రభ సూచించారు. 

అనాథలు, కష్ట కాలంలో ఉన్న పిల్లల సంరక్షణ, రక్షణ కోసం ఏర్పాటైన కేంద్ర ప్రాయోజిత మిషన్‌ వాత్సల్య పథకం లబ్ధిదార్లతో ఎమ్మెల్యే ముఖాముఖీని నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయం సక్రమంగా అందుతున్న తీరును, లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసు కున్నారు. అవసరమైన సహాయాన్ని అందించాలని అధికార్లను ఆదేశించారు. ఏలేశ్వరం, రాచపల్లి, శాంతి ఆశ్రమం, పెద్దిపాలెం పీహెచ్‌సీల వైద్యాధికారులు ఉషశ్రీ, రామ్‌కుమార్, యశస్వి, న్యాయవాది అవసరాల దేవి ఆయా అంశాల ప్రాముఖ్యతపై వివరించారు. అనంతరం వివిధ ప్రభుత్వ పధకాల ప్రచారం కరపత్రాలను ఎమ్మెల్యే సత్యప్రభ ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం ఎంపీపీ. గొల్లపల్లి బుజ్జి, , రౌతులపూడి ఎంపీపీ. గంటిమళ్ల రాజ్యలక్ష్మి, మాజీ ఎంపీపీ యిటంశెట్టి భాస్కరబాబు, శంఖవరం మాజీ వైస్ ఎంపీపీ. బొమ్మిడి సత్యనారాయణ, తెలుగు దేశం రాష్ట్ర పార్టీ కార్యదర్శి పర్వత సురేష్, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త మేడిశెట్టి సూర్యకిరణ్, ఏలేశ్వరం ఎంపీడీవో రామరాజు వర్మ, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, పాల్గొన్నారు.‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News