నంద్యాల పట్టణంలో నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఆయా వార్డులలో పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించిన వార్డు ప్రజలు, కౌన్సిలర్లు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో 17వ వార్డులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతుల మేరకు 20లక్షల నిధులను వార్డుకు కేటాయించి సీసీ రోడ్డు, డ్రైన్లను ఏర్పాటు చేసి అభివృద్ధి చేపట్టడం జరిగింది. 17వ వార్డు కౌన్సిలర్ సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ… గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటిని పరిష్కరించే ఒక మంచి కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంషావలి, బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, ఆప్కో డైరెక్టర్ సుబ్బరాయుడు, వార్డు ఇంచార్జి సుబ్బరాయుడు, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
