Thursday, October 3, 2024
Homeఆంధ్రప్రదేశ్MLA Shilpa: సచివాలయ వ్యవస్థతోనే గ్రామ స్వరాజ్యం

MLA Shilpa: సచివాలయ వ్యవస్థతోనే గ్రామ స్వరాజ్యం

శిల్పకు ఘన స్వాగతం

బండిఆత్మకూరు మండలంలోని కడమలకాల్వ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, వైయస్సార్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శ్రీశైలం నియోజకవర్గం శాసన సభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి. వైసిపీ నాయకులు, గ్రామప్రజలు గజమాలతో శిల్పాకు ఘన స్వాగతం పలికారు. గ్రామ సచివాలయం, వైయస్సార్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించి, కార్యాలయాల ప్రవేశ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వేద పండితుల ఆశీర్వాదాలు పొందారు.

- Advertisement -

ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం వేల కోట్లు ఖర్చు చేసి ప్రతి గ్రామ పంచాయతీలో సచివాలయాలు, వైయస్సార్ రైతు భరోసా కేంద్రలాను ఏర్పాటుచేసి ప్రజలకు చేరువగా పరిపాలన విభాగాలైన సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థలు ఏర్పాటు చేసి దేశానికే గర్వకారణమయ్యాడు. ప్రతి పనికి మండల కార్యాలయాలకు పోకుండా సచివాలయంలోనే సమస్యలు పరిష్కారం చేస్తున్నారని తెలియజేశారు. ప్రతిపక్ష నాయకుల మోసపూరిత మాటలు నమ్మొద్దని , గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యం ఈ సచివాలయం ద్వారా నెరవేరుతుందని తెలియజేశారు.

గ్రామ రైతు భరోసా కేంద్రాలలోనే రైతులకు సూచనలు సలహాలు ఇచ్చి వారికి కావలసిన రసాయనిక ఎరువును అందించి తెగుళ్లు సోకిన పంటలకు క్రిమిసంహారక మందులపై సలహాలు ఇస్తారని , రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమములో ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని పరిశీలించి, వైద్య పరీక్షలు చేసి, రోగులకు మెరుగైన వైద్యమందించాలని వైద్యాధికారులకు తెలియజేసారు .
ఈకార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి , ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి, మండల కన్వీనర్ బారెడ్డి శ్రీనివాస రెడ్డి,జేసీఎస్ మండల ఇంఛార్జి ముడి మేల పుల్లారెడ్డి, వైస్ ఎంపీపీ రాగల రమణ సింగిల్ విండో చైర్మన్ భూరం శివలింగం, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ విక్రమ్ సింహ నాయక్, కడమల కాల్వ సర్పంచ్ మేరీ పుష్పాంజలి, ఏసురత్నం, సుబ్బలక్ష్మాయ్య, బాబులు, నాగమయ్య, డిపెన్న, భాస్కర్, ఇస్మాయిల్, రహిమాన్, వెంగలరెడ్డిపేట సర్పంచ్ పల్లె నాగమణి సోమశేఖర రెడ్డి, భాలిస్వర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, పల్లె మహీంద్రా రెడ్డి, కాంట్రాక్టర్ దక్షేశ్వర రెడ్డి , గోపాల్ రెడ్డి, పెద్ద రామసుబ్బారెడ్డి, సుబ్బయ్య యాదవ్, బల రామిరెడ్డి, విష్ణు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు మరియు ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు, వాలంటరీలు, కార్యకర్తలు సచివాల కన్వీనర్లు గృహ సారథులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News