Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్MLA Shilpa: భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ

MLA Shilpa: భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ

రానున్న రోజుల్లో మరో వెయ్యి మంది లబ్ది దారులకు ఇళ్ల స్థలాలు, పట్టాలు పంపిణీ చేస్తాం

దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రి శిల్పా మోహన్ రెడ్డి హయాంలో నంద్యాలలోని భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఆదర్శ కాలనీగా ఏర్పాటు చేయాలనే సద్దుదేశంతో ఇళ్ల స్థలాలను కేటాయించారు. అయితే వారికి ఇళ్లస్థలాల పట్టాలను అందజేసేందుకు పలు అడ్డంకులు రావడంతో ఆలస్యమైందని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి పేర్కొన్నారు. నేడు అన్నీ అడ్డంకులు తొలగాయని, నాడు ఇచ్చిన హామీ ప్రకారం మాట తప్పని మడమ తిప్పని నాయకుడి బాటలో నేడు 30మంది భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయటం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే గృహంలో ఇళ్ళ స్థలాల పట్టాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.

- Advertisement -


ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తాము పూనుకుంటే టిడిపి నాయకులు అడ్డంకులు సృష్టిస్తూ కోర్టులకు వెళ్లడం పరిపాటిగా మారిందన్నారు. నాడు దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రి శిల్పా మోహన్ రెడ్డి భవన నిర్మాణ కార్మికులకు కేటాయించిన ఇళ్ల స్థలాలకు, పట్టాల పంపిణీకి ఏర్పడిన అడ్డంకులను అధిగమించి ఇచ్చిన హామీలను నేడు నెరవేరుస్తున్నామని తెలిపారు. పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన ఇళ్ల స్థలాలపై టీడీపీ వారు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని, ఐతే మంచి చేసే వారి సంకల్పానికి దేవుని ఆశీస్సులు తోడుగా నిలిచి విజయం సాధించామని తెలిపారు. గత నెలలో 3006 మంది పేదింటి అక్కా చెల్లెమ్మలకు ఎస్ ఆర్ బి సి కాలనీ సమీపంలో ఇళ్ల స్థలాలను కేటాయించి పట్టాలను పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో మరో వెయ్యి మంది లబ్ది దారులకు ఇళ్ల స్థలాలు, పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలను, పట్టాలను ఇవ్వటమే కాకుండా ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్ ద్వారా లక్ష80వేలు అలాగే పొదుపు మహిళలకు అదనంగా 35 వేలు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. వెంటనే గృహ నిర్మాణాలు ప్రారంభం చేయాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులకు తాము అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల తహసీల్డార్ శ్రీనివాసులు, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News