రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి బండిఆత్మకూరు మండల కేంద్రంలో మూడవ రోజు పర్యటించారు.గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు లో అందరికీ అందుతున్నాయా లేదా అని తెలుసు కుంటూ నవరత్నాలు పథకాలు లబ్ది పొందడం ద్వారా ప్రతి కుటుంబం సంతోషంగా వుండాలనే ఉద్దేశ్యం తోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ఈ సంక్షేమ ఫథకాలను ప్రజలకు అందరికి చేరువ చేయడం వలన రాష్ట్రంలో సుస్థిరపాలన నడుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దేరెడ్డి చిన్నసంజీవరెడ్డి, మాజీ ఎంపిపి దేసు వెంకటరామిరెడ్డి, మండల కన్వీనర్ బారెడ్డి శ్రీనివాసరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ ముడిమెల పుల్లారెడ్డి, సర్పంచి వై.సంధ్య, మాజీ సర్పంచి రాజంరెడ్డి సుజాతమ్మ, వైస్ ఎంపిపి ముంతల మధురాణి, చిన్న సుబ్బారెడ్డి, ఉప సర్పంచి అవుటాల నాగేశ్వరరెడ్డి, నారాయణ రెడ్డి (బాబు రెడ్డి), సీమ సుబ్బారెడ్డి, APSPDCL డైరెక్టర్ శశికళ రెడ్డి, దిలీఫ్ రెడ్డి, ఎంపీడీఓ వాసుదేవగుప్తా, సింగిల్ విండో ప్రెసిడెంటు భూరం శివలింగం, కాకనూరు సర్పంచి మహేశ్వరరెడ్డి, ఎంఏఓ స్వాతి, ఎర్రగుంట్ల పుల్లయ్య, హౌసింగ్ ఏ ఈ సుంకిరెడ్డి, గ్రామ వాలంటరీలు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల వైసీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
MLA Shilpa: సంక్షేమం, సుస్థిర పాలన జగన్ కే సాధ్యం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES