మున్సిపాలిటీలో పనిచేస్తూ చనిపోయిన మున్సిపల్ కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు స్థానికులు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, కే మహమ్మద్ గౌస్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణయ్య భాస్కరాచారి నాయకులు రామకృష్ణ, ఆదాము, బిబిలతోపాటు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. అనంతరం సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కే మహమ్మద్ గౌస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణయ్య భాస్కరాచారిలు మాట్లాడుతూ.. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తూ మే నెల 29వ తేదీ బి. తులసి రామ్ అనే కార్మికుడు మరణించాడు. అక్టోబర్ 1న తేదీ పి. బసవయ్య అనే కార్మికుడు మృతి చెందాడు. కుటుంబాలను పోషించే వీరు మృతి చెందడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఆ కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, మున్సిపాలిటీలో ప్రజలకు సేవ చేస్తూ ఏళ్ల తరబడి పనిచేస్తూ అన్ని రకాల అర్హతలు ఉన్న కార్మికులకు స్కిల్డ్, సెమీస్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని, ఈ రెండు సమస్యలను కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపేలా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఆప్కాస్ లో పొందుపరిచేలా చర్యలు తీసుకోని కార్మికులకు న్యాయం చేయగలరని, ఆ కుటుంబాలను ఇబ్బందుల నుంచి కాపాడాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
MLA Shilpa Ravi: కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయండి
ఎమ్మెల్యేకి విజ్ఞప్తి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES