రాష్ట్రంలో పేదల పట్ల వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సీఎం జగనన్న చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నడానికి నేడు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమమే నిదర్శనం అని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. నంద్యాల మండలం అయ్యలూరు గ్రామంలోని రెండవ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేదల ప్రాణాల కన్నా, ఆరోగ్యం కన్నా ఏది ముఖ్యం కాదని నమ్మిన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారన్నారు. పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ ఇంటి వద్దకే వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి, వారికి జగనన్న ఆ రోగ్య సురక్ష ప్రత్యేక క్యాంపుల ద్వారా వైద్య సేవలను అందిస్తూ అవసరమైన వారికి ఉచిత మందులను పంపిణీ చేస్తారన్నారు.
ఈ క్యాంపులో ఈసీజీ, యూరిన్, హిమోగ్లోబిన్, షుగర్ తదితర వైద్య పరీక్షలను నిర్వహించి, దాదాపుగా 110 రకాల మందులను అవసరమైన వారికి అందజేయడం జరుగుతుందన్నారు. కంటి పరీక్షలు చేసి వారికి అద్దాలు అందిస్తున్నామన్నారు. అలాగే వినికిడి లోపం చిన్నారులకు ఖరీదైన కాంక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ లను చేయించేందుకు అవసరమైన 12 లక్షల రూపాయలను ఉచితంగా అందజేశారన్నారు.
అయ్యలూరు గ్రామంలో చిన్నారికి ఇటీవలే కాంక్లియర్ ఇంప్లాంట్ చికిత్స నిర్వహించడం జరిగిందని, చక్కగా చిన్నారికి వినపడుతుంది తెలిపారు. అలాగే గ్రామంలో టిడిపి పార్టీకి చెందిన వారి కుమార్తె సుప్రజకు 6 లక్షల రూపాయలతో పార్టీలకు అతీతంగా కేవలం పేదవారికి వైద్య సేవలను అందించాలని సదుద్దేశంతో కాంక్లియార్ ఆపరేషన్లు నిర్వహించామన్నారు. గ్రామంలోని టిడిపి వార్డు మెంబర్ అయిన నాగేశ్వరరావు అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు పార్టీలను చూడకుండా ఎల్ఓసి ద్వారా 8 లక్షల 50 వేల రూపాయల ఖర్చుతో కూడిన ఆపరేషన్ ను నిమ్స్ హాస్పిటల్లో చేయించామన్నారు.
ఆపరేషన్ విజయవంతమై ఆయన ఆరోగ్యంగా ఉన్నారన్నారు. తమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల పట్ల మనసుతో పరిపాలించాలని రాజకీయాలను, కుల, మతాలను పక్కన పెట్టాలన్నారు. అటువంటి మనసున్న మంచి నాయకుడి నాయకత్వంలో తాము పేదలకు సేవ చేసే అవకాశం కలగడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవలను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. జగన్ అన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవికుమార్ రెడ్డి, అబ్దుల్ రషీద్, శంకర్ రెడ్డి, ఎల్లయ్య, ఎల్ల సుబ్బయ్య, వైస్ ఎంపీపీ పుష్పలత, వై స్ సర్పంచ్ శివ లలిత, గ్రామ వైసిపి నాయకులు వైద్యులు పాల్గొన్నారు.